కడప: ప్రభుత్వం తగ్గించిన జిఎస్టీపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి: కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి
Kadapa, YSR | Sep 26, 2025 ప్రభుత్వం తగ్గించిన జిఎస్టీపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి "సూపర్ జిఎస్టి - సూపర్ సేవింగ్స్" పై నెల రోజుల పాటు నిర్వహించాల్సిన సెలబ్రేషన్స్, సీజనల్ కండిషన్స్, పిఎం కుసుమ్, కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు, సోలార్, విండ్ ప్రాజెక్టులకు సంబంధించిన భూ సంబంధిత అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుండి కలెక్టర్ హాజరయ్యారు