రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల్లో అక్రమాలపై సేవ్ టీచర్స్ సంస్థ నాయకుల ఆందోళన
రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల్లో జరిగిన విస్తృత అక్రమాలపై సేవ్ టీచర్స్ సంస్థ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొంగరకలాన్ కలెక్టరేట్ వద్ద మీడియా సమావేశాన్ని సేవ్ టీచర్స్ అధ్యక్షుడు బొడ్డు రవి నిర్వహించారు. జీవో 317 అమల్లో అక్రమ బదిలీలు, పోస్టింగ్లు జరిగి గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులకు పెద్దఎత్తున అన్యాయం జరిగిందని ఆరోపించారు.