కనిగిరి : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చే నూతనంగా నియమితులైన ప్రకాశం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరి కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు నర్సింహారెడ్డిని కనిగిరిలోని టిడిపి కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి మాట్లాడుతూ.... ప్రకాశం జిల్లాలో గ్రంధాలయాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గ్రంథాలయాల్లో మౌలిక వసతులు కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరారు.