నందికోట్కూరు: అక్రమంగా గో రవాణా చేస్తే కఠిన చర్యలు: నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం, బ్రాహ్మణ కొట్కూరు ఎస్సై మణికంఠ
ఎవరైనా సరే అక్రమంగా గో రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని నందికొట్కూరు రూరల్ సీఐ టి సుబ్రమణ్యం మరియు బ్రాహ్మణకొట్కూరు ఎస్సై వి మణికంఠ అన్నారు. బక్రీద్ పండుగ సమీపిస్తున్నందున జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు అంతర్ జిల్లా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కొల్లబావాపురం వద్ద సోమవారం అంతర్‌జిల్లా (ఇంటర్ డిస్ట్రిక్ట్) చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు ఎస్సై మణికంఠ తెలిపారు.చెక్ పోస్ట్ ను రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం పరిశీలించి ఎస్ఐకి మరియు సిబ్బందికి తగు సూచనలు సీఐ సూచించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పండుగ సీజన్‌లో కొందరు వ్