ఉరవకొండ: దీపావళి పర్వదినాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని బెలుగుప్ప ఉరవకొండ వజ్రకరూర్ కూడేరు విడపనకల్లు మండలాల్లోని గ్రామాల్లో ప్రధాన ఆలయాల్లో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో సోమవారం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. బెళుగుప్ప మండల పరిధిలోని ప్రధాన ఆలయాలైన శ్రీ రామేశ్వర స్వామి శ్రీ మంజునాథేశ్వర స్వామి శ్రీ విఘ్నేశ్వర స్వామి శ్రీ కన్యకా పరమేశ్వరాలయం, బుదిగిమ్మ పద్మావతి వెంకటరమణ స్వామి, శ్రీ శ్రీరంగాపురం శ్రీ రంగనాథ స్వామి ఆలయం దీపావళి పర్వదినాన పూజలు, భజనలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు