కడప: మొంథా తుఫాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి టెలి కాన్ఫరెన్స్
Kadapa, YSR | Oct 28, 2025 మొంథా తుఫాన్ నేపథ్యంలో.. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో  రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి మట్టంపై..   అప్రమత్తంగా ఉంటూ.. సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని  కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు.మొంథా తుఫాను వర్షాల పరిస్థితులను ఎదుర్కొనే సహాయక చర్యలు, సంసిద్ధతపై.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి.. జేసీ అదితి సింగ్, జిల్లా స్థాయి అధికారులతో  టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, అత్యవసర సహాయక చర్యలపై సూచనలిచ్చారు.