కర్నూలు: గత వైసిపి ప్రభుత్వం లో వీఆర్ఏల పై పెట్టిన క్రమ కేసులు ఎత్తివేయాలి .. వీఆర్ఏలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన
వీఆర్ఏలకు కనీస వేతనం ఇవ్వాలని గ్రామ రెవెన్యూ సహాయక సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు డిమాండ్ చేశారు. సోమవారం కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు ఆందోళన చేపట్టారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గత ప్రభుత్వ హయాంలో చలో విజయవాడ కార్యక్రమంలో రెండు కేసుల్లో 63 మందిపై అక్రమ కేసులు పెట్టారని వాటిని ఎత్తివేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. వీఆర్ఏలకు 26 వేల రూపాయలు ఇవ్వాలని, ప్రమోషన్లు కల్పించాలని కోరారు. కూటమి ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. దశలవారీగా ఆందోళన చేపడుతున్న కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకపోవడం దారుణం అన్నారు.