హిందూపురం వైసిపి కార్యాలయం పై దాడి అత్యంత హేయమైన చర్య.
వైసిపి నియోజకవర్గ ఇన్చార్జ్
నీసార్ అహ్మద్.
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో ఆదివారం మెడికల్ కాలేజీల ప్రైవేటు కరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మదనపల్లె వైయస్సార్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నిసార్ అహమద్, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూపురంలో వైసిపి కార్యాలయం పై దాడి అత్యంత హేయమైన చర్య అన్నారు. దాడిని త్రీవంగా ఖండిస్తున్నామన్నారు. హిందూపురం లో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్రప్రధాన కార్యదర్శి అనిషా రెడ్డి. మున్సిపల్ చైర్మన్ మనుజా రెడ్డి, వైస్ చైర్మన్జింక చలపతి ,వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు