పలమనేరు: మున్సిపల్ కాంప్లెక్స్ సమస్యలను కమిషనర్ కు విన్నవించిన దుకాణదారులు, పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ
పలమనేరు: మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ కాంప్లెక్స్ దుకాణదారులు కమిషనర్ రమణా రెడ్డి కి తమ సమస్యలపై మెమొరాండం సమర్పించారు. నూతన భవంతి వర్షం పడితే కారడం, సంబంధం లేని వ్యక్తులు కార్లు లారీలు షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో నిలిపి ఉంచి వెళ్లిపోవడం, ప్రధానంగా మందుబాబులు ఆగడాలు వీటిపై మున్సిపల్ కమిషనర్ కు వివరించారు. వెంటనే స్పందించిన కమిషనర్ అధికారులు పిలిపించి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.