కేంద్ర ప్రభుత్వం అమలుకు తీసుకొచ్చిన నాలుగు కార్మిక కోడ్లు, కార్మికులను కట్టు బానిసత్వం లోకి నెట్టేస్తాయని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ విమర్శించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మంగళవారం సిఐటియు పేట జిల్లా ద్వితీయ మహాసభలకు ఆయన ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. 8 గంటల పని దినం పోయి 12 గంటల పని దినం అమల్లోకి వచ్చి కార్మికుల శ్రమ దోపిడిని ఇంకా తీవ్రతరం చేసేందుకే నాలుగు కార్మిక కోడ్లను తీసుకువచ్చారని విమర్శించారు.