పటాన్చెరు: చిన్నారుల మృతి బాధాకరం – భద్రతా చర్యలు బలోపేతం చేయాలని సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుధా శ్రీనివాస్
అమీన్పూర్ వాణీ నగర్ అర్బన్రైజ్ అపార్ట్మెంట్స్లో స్విమ్మింగ్పూల్లో చిన్నారులు ప్రజ్ఞ, అద్వికరెడ్డి మృత్యువాత పడ్డ దుర్ఘటనపై సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను శనివారం పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మున్సిపల్ అధికారులు, అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ భద్రతా చర్యలు బలోపేతం చేయాలని సూచించారు. చిన్నారుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆమె ప్రార్థించారు.