సదాశివనగర్: సదాశివనగర్ లో 108 అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ చేసిన కామారెడ్డి జిల్లా మేనేజర్ తిరుపతి
సదాశివనగర్ మండల కేంద్రంలోని 108 అంబులెన్స్ ను కామారెడ్డి జిల్లా మేనేజర్ తిరుపతి బుధవారం 4 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనంలోని ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలను పరిశీలించారు. సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో 108 సిబ్బంది రమేష్, కార్తీక్ పాల్గొన్నారు. మెరుగైన సేవల కోసం ఈ తనిఖీలు చేపట్టనున్నట్లు మేనేజర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 108 అంబులెన్స్ ఉద్యోగులు ఇయంటి రమేష్, పైలట్ కార్తీక్ పాల్గొన్నారు.