బనగానపల్లె: చింతలాయిల పల్లెలో గడ్డివాములు దగ్ధం
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లె శుక్రవారం అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళన చెందారు. గ్రామ సమీపంలోని కల్లం దొడ్ల వద్ద గడ్డి వాముల సమీపంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పక్కనే గడ్డివాములు, పశువుల పాకలు ఉండటంతో గ్రామస్థులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సొసైటీ అధ్యక్షుడు వివేకానంద రెడ్డి రాంకో ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు మంటలను అదుపు చేశారు.