పోలీసు సంక్షేమం, మొబిలిటీ విభాగాల అభివృద్ధి లక్ష్యంగా డీజీపీ బి. శివధర్ రెడ్డి కీలక కార్యక్రమాలు చేపట్టారు. పీటీవో (PTO) క్యాంపస్‌లో ఆయన ఆధునిక ఫ్యూయల్ అవుట్‌లెట్‌ను ప్రారంభించారు. అంబర్పేట్ ఎస్ఏఆర్ సీపీఎల్ (SAR CPL)లో కొత్త పీటీవో భవనానికి శంకుస్థాపన చేశారు. రూ.59 కోట్లతో నిర్మించనున్న ఈ ఆధునిక సముదాయం వాహనాల మెయింటెనెన్స్, శిక్షణ, అత్యవసర సేవల్లో వేగాన్ని పెంచనుంది.