చిన్నగూడూరు: BC రిజర్వేషన్లు 42 శాతం పెంపు బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా చిన్నగూడూరులో CM రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం,దశాబ్దాల కాలంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు, మరియు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా,శాసనసభ సమావేశాలలో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ రామచంద్రనాయక్ చిత్రపటాలకు, చిన్నగూడూరు మండల కేంద్రంలో డోర్నకల్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గునిగంటి కమలాకర్ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు.అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకొని సంబరాలు జరుపుకున్నారు