పరకాల పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు వ్యవసాయ శాఖ అధికారులతో పరకాల mla సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు
ఆదివారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు వ్యవసాయ శాఖ అధికారులతో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.పరకాల నియోజకవర్గంలోని రైతులకు యూరియా కొరత తలెత్తకుండా చూడాలని, రైతులకు అవసరమైన యూరియా ఎరువు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.మండలాల వారీగా డిమాండ్ కు అనుగుణంగా సరఫరా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు.టోకెన్ పద్ధతిలో స్టాక్ ను బట్టి రైతులకు యూరియా బస్తాలు అందించాలని,ఇప్పటికే మనకు రావాల్సిన కోట వచ్చిందని, రైతులకు అవసరమైన యూరియా సకాలంలో పంపిణీ చేయాలని