గుంటూరు: తక్కెల్లపాడు వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ను పరిశీలించిన గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
Guntur, Guntur | Sep 26, 2025 గుంటూరు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో 14 లక్షల మంది జనాభా ఉన్నారని ఆయా ప్రజలకు శుద్ధికరమైన మంచినీటిని అందించవలసిన అవసరం నగరపాలక సంస్థపై ఉందని గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం తక్కెల్లపాడులోని వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ ను అదేవిధంగా గుంటూరు స్తంభాలగరువులోని వాటర్ ట్యాంకులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా డయేరియా సమస్య ఏర్పడిందన్నారు.