కర్నూలు: నగర మేయర్ బి వై రామయ్య వాల్మీకులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి : వాల్మీకి మహర్షి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్
వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని కర్నూల్ లో వాల్మీకి మహర్షి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు .శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించారు. కర్నూల్ నగరంలో వాల్మీకి విగ్రహం పై వివాదం చోటు చేసుకోవడం తగదు అని ఉన్న విగ్రహం యధాతధంగా ఉండాలని వాల్మీకి నాయకులు డిమాండ్ చేశారు. మేయర్ బి వై రామయ్య వెంటనే వాల్మీకులకు క్షమాపణ చెప్పాలని కోరారు. వాల్మీకి ఏర్పాటుకు నాయకులు ఎమ్మెల్యేలు మినిస్టర్ లు సహకరిస్తున్నారు.