నంద్యాల అర్బన్: నంద్యాలలో ఓ యువకుడు పై బీరు బాటిల్ తో దాడి చేసి దారుణ హత్య
Nandyal Urban, Nandyal | Jun 27, 2026
నంద్యాల మండలం కానాల గ్రామ శివారులో శనివారం దారుణ హత్య చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడిపై బీరు బాటిల్తో దారుణంగా దాడి చేశారు. దుండగులు బీరు బాటిల్తో యువకుడి తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు మృతదేహాన్ని గమనించి సమాచారం అందించగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాపు సారంభించారు.