కనిగిరి పట్టణంలోని సుందరయ్య భవనంలో శనివారం సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జీవీ కొండారెడ్డి ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొండ రెడ్డి మాట్లాడుతూ.... పేదల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాన్ని ఇల్లు లేని పేదలకు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, పక్కా గృహాలను నిర్మించాలన్నారు. లేకుంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తామన్నారు.