నంద్యాల అర్బన్: పూలే ఆశయాలు ఆచరణలో పెట్టాలి: నంద్యాలలో మంత్రి ఫరూక్
Nandyal Urban, Nandyal | Apr 11, 2026
సామాజిక సమానత్వం విద్యా విస్తరణ మహిళ సాధికారత కోసం జీవితాంతం పోరాడిన మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రతి ఒక్కరు ఆచరణలో పెట్టాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ పిలుపునిచ్చారు. శనివారం నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ అర్చ వద్ద మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి, కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తీక్,ప్రజా ప్రతినిధులు ఇతర సంఘాల నాయకులు, జిల్లా అధికారులు పాల్గొని పూలే విగ్రహానికి పుష్ప మాలలు అర్పించి నివాళులర్పించారు