డోన్: డోన్ సమీపంలో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
Dhone, Nandyal | Jul 2, 2026 నంద్యాల జిల్లా డోన్ ఐటీఐ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో డోన్ నుంచి కర్నూలు వెళ్తుండగా రోడ్డు దాటుతున్న వ్యక్తిని తప్పించబోయి డ్రైవర్ బస్సును పక్కకు తిప్పారు. దీంతో రోడ్డు పక్కనున్న డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ప్రయాణికులు తెలిపారు.