కోడుమూరు: కోడుమూరులో ప్రజా ఉద్యమం పోస్టర్ విడుదల చేసిన వైసిపి ఇన్చార్జి, నాయకులు
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12న కోడుమూరులో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వైసిపి నియోజకవర్గ ఇన్చార్జి ఆదిమూలపు సతీష్ అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయం వద్ద ప్రజా ఉద్యమంకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ చంద్రబాబు పిపిపి పేరుతో మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. దీనివలన పేదలకు వైద్యం, వైద్య విద్య దూరమవుతుందని తెలిపారు.