తుఫాను వల్ల నష్టపోయిన రైతులు ఎవరు అధైర్య పడొద్దు, ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా
ఆత్మకూరు మార్కెట్ యార్డ్ లో మొక్కజొన్న రైతులను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలు నష్టపోయిన రైతులను అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలిపారు,కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత రెండు రోజులుగా సమీక్షలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ అన్ని వసతులు కల్పిస్తున్నారని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు.మొక్కజొన్న పంట.. ఆరబోసిన మొక్కజొన్న కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని, ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.అధికారులు పంటలు పరిశీలించి నివేదికలు అందిస్తారు రైతులు సంయమనం పాటించి సహకరించండి అన్నారు.