అంబర్‌పేటలో విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. దంపతులతో పాటు కూతురు ఉరేసుకుంది. అంబర్‌పేటలోని రెడ్ బిల్డింగ్‌లో ఈ ఘటన జరిగింది. 3 నెలలు క్రితమే పెద్ద కూతురు చనిపోవడంతో రాంనగర్ నుంచి ఫ్యామిలీ అంబర్‌పేటకు వచ్చారు. పెద్ద కూతురు చనిపోయిందన్న బాధలోనే ఫ్యామిలీ (శ్రీనివాస్-విజయలక్ష్మీ, శ్రావ్య) సూసైడ్ చేసుకోవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.