ఒంగోలు అర్బన్: కే పల్లెపాలెం లో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | May 1, 2026
ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు శుక్రవారం పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా కొత్తపట్నం మండలం కే పల్లెపాలెం గ్రామానికి వెళ్లి అక్కడ స్థానికుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా కొత్తపట్నం మండలంలోని సచివాలయాల వారీగా అధికారులను పంపి అక్కడ సమస్యల వివరాలను వాకబు చేశారు డ్రామా పీడీ స్థాయి నుండి అగ్రికల్చర్ జెడి వరకు కొత్తపట్నంలోని 15 సచివాలయాల పరిధిలో ప్రజలతో కలిసి స్థానిక సమస్యలపై చర్చించారు. ప్రధానమైన సమస్యల వివరాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. కలెక్టర్ పల్లెపాలెం లో ఈరోజు రాత్రికి బస చేయనున్నారు