ఒంగోలు అర్బన్: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించిన కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 15, 2026
ప్రజా సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ రాజాబాబు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహణకు శ్రీకారం చుట్టారు. సోమవారం ప్రకాశం భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డీ.ఆర్.వో. మాధురి, ఆర్.డీ.వో. చంద్ర శేఖర్ నాయుడు, డీ.పీ.వో. వెంకటేశ్వరరావులతో కలిసి ఆయా వర్గాల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ ప్రజలు కోరిన నేపథ్యంలో ప్రతి నెలా మూడో సోమవారం వీరికోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు.