అనుమతులు లేకుండా క్రాకర్స్ షాపులు పెడితే చర్యలు : బాలాజీ నగర్ సీఐ సాంబశివరావు
ప్రభుత్వ అనుమతులు లేకుండా క్రాకర్స్ షాపులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని బాలాజీ నగర్ సిఐ సాంబశివరావు హెచ్చరించారు. సర్వేపల్లి కలవకట్ట, హరినాధపురం పరిసర ప్రాంతాలలో ఆయన పర్యటించారు. క్రాకర్స్ దుకాణాలు పెట్టుకునే వారికి అధికారుల అనుమతులు తప్పనిసరి అని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా షాపులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శుక్రవారం మధ్యాహ్నం హెచ్చరించారు