కనిగిరి: ఈనెల 11న పెద చెర్లోపల్లి మండలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు, ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
పెదచెర్లోపల్లి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 11వ తేదీన పెదచెర్లపల్లి మండలంలో పర్యటించనున్నారు. మండలంలోని లింగన్నపాలెంలో MSME పార్కుకు నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డికి సమాచారం అందింది. వెంటనే ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అధికారులతో కలిసి లింగన్నపాలెంలో శనివారం పర్యటించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పగడ్బందీగా చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.