నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని కొండపేట మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మెగా డీఎస్సీ-2025 విజేతలకు ఆదివారం సన్మానం జరిగింది. నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులతో నిర్వహించిన ఈ ఆత్మీయ సమావేశానికి బీసీ ఇందిరా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్రమైనదని, నాణ్యమైన బోధనతో విద్యార్థుల భవిష్యత్తును బంగారుమయం చేయాలని ఆమె సూచించారు