డోన్ మండలం ఓబులాపురం మిట్ట దగ్గర జాతీయ రహదారిపై శనివారం రాత్రి కారు ఢీకొని అదే ఓబులాపురం గ్రామానికి చెందిన లాలు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.