ఒంగోలు అర్బన్: ప్రకాశం మార్కాపురం ఉమ్మడి జిల్లాల ఎస్పీని అభినందించిన హోం మంత్రి అనిత
Ongole Urban, Prakasam | Jun 6, 2026
మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణకు సమర్థవంతమైన చర్యలు చేపడుతున్న ప్రకాశం మార్కాపురం జిల్లాల ఎస్పీ . హర్షవర్ధన్ రాజు పనితీరును రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అభినందించారు. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా పోలీసు అధికారులతో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత కనిగిరిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాకు సంబంధించిన భౌగోళిక పరిస్థితులు, పోలీసు పరిపాలనా విభజన, సర్కిళ్లు, మండలాల పరిధి, శాంతిభద్రతలు, నేర నియంత్రణ తదితర అంశాలపై చర్చించారు.