జహీరాబాద్: సజ్జ రావు పేట తండాలో గుడుంబా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలో గుడుంబా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. మొగుడంపల్లి మండలంలోని సజ్జ రావు పేట తాండలో నమ్మదగిన సమాచారంతో మంగళవారం రాత్రి దాడులు నిర్వహించి జాదవ్ మున్యా ,రాథోడ్ గోవింద్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 4.5 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.