కర్నూలు: భారత్ పట్ల ప్రపంచ దేశాలకు మంచి అభిప్రాయం ఉంది : బిజెపి అధికార ప్రతినిధి డాక్టర్ వినూషా రెడ్డి తెలిపారు.
భారతదేశం పట్ల ప్రపంచ దేశాలకు మంచి అభిప్రాయం ఉందని బిజెపి అధికార ప్రతినిధి డాక్టర్ వినూషా రెడ్డి తెలిపారు. మంగళవారం కర్నూల్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.... అమెరికా ప్రభుత్వం ఆధ్వర్యంలో (IVLP)లో భారత్ తరపున తాను పాల్గొనడం జరిగిందన్నారు. రాజకీయ సామాజిక రంగంలో మహిళల పాత్ర అనే అంశంపై 22 దేశాల మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ తో పోలిస్తే ఇతర దేశాల్లో మహిళలకు భద్రత లేదన్నారు. 2029 ఎన్నికల్లో చట్టసభల్లో 40% కి పైగా మహిళలు ప్రతినిత్యం వహిస్తారణ నమ్మకం వ్యక్తం చేశారు.IVLP పర్యటనకు తనను ఎంపిక చేసిన బిజెపికి కృతజ్ఞతలు తెలిపారు.