కొత్తపేట మండలంలోని మందపల్లి శ్రీ శనీశ్వర స్వామి వారి ఆలయానికి రూ.1,25,093
కొత్తపేట మండలంలోని మందపల్లి గ్రామంలో ఉన్న శ్రీ శనీశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో శనివారం భక్తులు నిర్వహించిన వివిధ సేవల ద్వారా స్వామివారి ఆలయానికి రూ.1,25,093 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి కే.విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆలయ సన్నిధిలో శని దోష నివారణ పూజలు, తైలాభిషేకాలను నిర్వహించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.