ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లాలో 2,17,573 మంది లబ్ధిదారులకు 94,82, 77,000 రూఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ : జాయింట్ కలెక్టర్
Ongole Urban, Prakasam | Jul 1, 2026
రాష్ట్ర ప్రభుత్వ సామాజిక భద్రత కింద వృద్ధులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతర పింఛన్ల దారులకు ప్రతి నెలా 1వ తేదీన కచ్చితంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందచేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పేర్కొన్నారు. బుధవారం ఒంగోలు నగరం, 21 డివిజన్ పరిధిలోని దారావారితోటలో గల ఇందిరా కాలనీలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, మున్సిపల్ అధికారులు, వార్డు సచివాలయ సిబ్బందితో కలిసి ప్రతి ఇంటి వద్దకే వెళ్ళి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని లబ్దిదారులకు పింఛన్ సొమ్ము అందజేసారు.