డోన్: బేతంచెర్ల మండలంలో వృద్ధుడు అదృశ్యం, కేసు నమోదు
Dhone, Nandyal | Jun 16, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం తవిసికొండ గ్రామానికి చెందిన బిచ్చపోగుల బాలరంగడు అనే వృద్ధుడు అదృశ్యమైనట్లు హెడ్ కానిస్టేబుల్ పుల్లయ్య తెలిపారు. ఈ నెల 6న ఆసుపత్రికి వెళుతున్నానని చెప్పి వెళ్లిన బాలరంగడు తిరిగి ఇంటికి రాలేదు. బంధువులు వివిధ ప్రాంతాల్లో గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. వృద్ధుడి కొడుకు రంగస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ పుల్లయ్య వివరించారు.