కనిగిరి: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స , పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్
పామూరు మండలం రావిగుంటపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఆర్టీసీ బస్సును కంటైనర్ లారీ ఢీ కొట్టి 9 మందికి గాయాలైన విషయం తెలిసిందే. గాయపడ్డ వారికి కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు సమాచారం తెలుసుకున్న కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ వైద్యశాలకు వెళ్లి గాయపడ్డ వారిని శుక్రవారం రాత్రి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య చికిత్సను అందించాలని వైద్యులకు మున్సిపల్ చైర్మన్ సూచించారు.