ఒంగోలు అర్బన్: ఒంగోలులో వేడెక్కిన రాజకీయాలు, రాజకీయాలలోకి ప్రవేశించిన బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి
Ongole Urban, Prakasam | Jun 30, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో రాజకీయాలు వేడెక్కాయి. మాజీమంత్రి జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి రాజకీయ ప్రవేశం చేశారు. జనసేన పార్టీలో పదవి కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. దీంతో స్థానిక జనసేన నాయకులతో పాటు బాలినేని వర్గం ఆనందం వ్యక్తం చేస్తుంది. ప్రణీత్ రెడ్డికి అనుకూలంగా ఒంగోలు పట్టణంలో నాయకులు కార్యకర్తలు బాలినేని వర్గం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రణీత్ రెడ్డికి కీలక పదవి దక్కుతుందని బాలినేని వర్గం ఆశాభావం వ్యక్తం చేస్తుంది.