సంతనూతలపాడు సచివాలయాన్ని డిప్యూటీ ఎంపీడీవో రవికుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం సచివాలయ సిబ్బందితో సమావేశమయ్యారు. సచివాలయ సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు మెరుగైన సేవలను అందించాలన్నారు. కార్యాలయం చుట్టూ ప్రజలను ఎక్కువ రోజులు తిప్పుకోకుండా నిర్దిష్ట సమయంలో సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వం నిర్దేశించిన అన్ని సర్వేలను సకాలంలో పూర్తి చేయాలని డిప్యూటీ ఎంపీడీవో రవికుమార్ ఆదేశించారు