బి కొత్తకోటలో ఘనంగా ఏఐటియుసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు .
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి కొత్తకోట గ్రామంలో ఏఐటీయూసీ 106 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి సలీం బాషా మాట్లాడుతూ కార్మికుల కర్షకుల సమస్యల పరిష్కార కోసం ఆలు పెరగని పోరాటాలు చేసిన ఘనత ఏఐటీయూసీ దే అన్నారు. ఏఐటీయూసీ ఆవిర్భావం నుంచి ప్రజా సమస్యల కోసం ఉద్యమిస్తున్నట్లు తెలిపారు. అసంఘటిత కార్మికులకు రక్షణ కోసం ఏఐటియుసి పోరాటాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ. కార్యకర్తలు పాల్గొన్నారు