శంకరంపేట ఏ: బూర్గుల్ గ్రామంలో మద్యపాన నిషేధం పై తీర్మానం
మద్యానికి బానిసైనా వారు తమ కుటుంబాలను ఆర్థికంగా విచ్ఛిన్నం చేస్తున్నారనే ఉద్దేశంతో తన గ్రామంలో మద్యపానాన్ని నిషేధించినట్లు గ్రామ పెద్ద భాస్కర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంలో మద్యం అమ్మకాలను నిషేధించినట్లు గ్రామస్థుల సమక్షంలో గురువారం తీర్మానం చేశారు. మద్యం విక్రయిస్తే రూ. లక్ష జరిమానా, సమాచారం అందించిన వారికి రూ.20 వేల నజరానా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.