మంచిర్యాల: మంచిర్యాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించబోతున్నట్లు ప్రకటించిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్
వందేభారత్ రైలు మంచిర్యాల ప్రాంత ప్రజలకు ఇచ్చిన వరమని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందేభారత్ రైలు హాల్టింగ్ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వందేభారత్ రైలును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అతి త్వరలో 3 కోట్ల 50 లక్షల రూపాయలతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించబోతున్నట్లు ప్రకటించారు.