ఒంగోలు అర్బన్: జిల్లా పరిశ్రమ అభివృద్ధిలో చిత్ర స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సేవలు అత్యంత కీలకమైనవి : జిల్లా కలెక్టర్
Ongole Urban, Prakasam | Jun 30, 2026
అభివృద్ధిపరంగా జిల్లా రూపురేఖలు మారటంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సేవలు అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని వారికి దిశా నిర్దేశం చేశారు. వివిధ శాఖలలో మండల స్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి సామర్థ్యం పెంపు కోసం ప్రకాశం భవనంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. స్వర్ణాంధ్ర - 2047 కార్యక్రమంలో భాగంగా కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. క్షేత్రస్థాయిలో గ్రాస్ వ్యాల్యూ ఎడిషన్ (పెంపు ద్వారా జిల్లా జిడిపి పెరిగి, తలసరి ఆదాయం పెరుగుతుందన