ఆళ్లగడ్డ: దోమలను అరికట్టేందుకు పరిశుభ్రత ముఖ్యం : ఆళ్లగడ్డ సామాజిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శబరీష్ కుమార్
నంద్యాలజిల్లా ఆళ్లగడ్డ డెంగ్యూ నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, ఇంటి చుట్టూ ప్రక్కల నీరు నిలవకుండా చూసుకోవాలి అని ఆళ్లగడ్డ సిహెచ్సి డాక్టర్ శబరిష్ కుమార్ తెలిపారు, శనివారం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా సామాజిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు, దోమల పెరుగుదలను అరికట్టేందుకు పరిశుభ్రత పాటించడం ఎంతో అవసరం అని ఆయన పేర్కొన్నారు, ప్రజల్లో వ్యాధిపై అవగాహన కల్పించారు, ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు