ఒంగోలు అర్బన్: కొత్తపట్నం సముద్ర తీరంలో తమిళనాడుకు చెందిన ఓట్లు సంచారం, తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానిక జాలర్లు
Ongole Urban, Prakasam | Jun 28, 2026
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం వాడరేవు సముద్ర తీరంలో చెన్నైకు చెందిన ఫిషింగ్ బోట్లు ఆదివారం కనిపించడంతో కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన జాలర్లు ఏపీ సముద్ర జలాల్లో చేపల వేట సాగిస్తున్నారని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చేపల వేట తగ్గి తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతోందని వాపోయారు. మత్స్యశాఖ అధికారులు, కోస్ట్ గార్డ్ స్పందించి చర్యలు తీసుకోవాలని జాలర్లు కోరుతున్నారు.