బనగానపల్లె: బనగానపల్లె క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతుల స్వీకరించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆదివారం క్యాంపు కార్యాలయంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుంచి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వయంగా వినతుల స్వీకరించారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.