కథలాపూర్: అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం భీమారం మండలం మన్నెగూడెం,మేడిపల్లి మండల కేంద్రంతో పాటు కట్లకుంట,పొరుమల్ల గ్రామాల్లో శరన్నవరాత్రుల సందర్భంగా పలు మండపాలలో నెలకొల్పిన దుర్గ మాత అమ్మవారిని బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.మేడిపల్లి మండల పర్యటనలో భాగంగా మేడిపల్లి మండల కేంద్రంలో నాయకులు కార్యకర్తలతో కలిసి విప్ చాయ్ తాగుతూ..పలు అంశాలపై చర్చించారు.అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.