బనగానపల్లె: నందవరం శ్రీ చౌడేశ్వరీ దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన టిడిపి సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరంలో వెలసిన శ్రీ చౌదేశ్వరీ దేవి అమ్మవారికి టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు బైరెడ్డి రాజశేఖరరెడ్డికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకగా ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ బైరెడ్డి చే శ్రీ చౌదేశ్వరీదేవి అమ్మవారికి కుంకుమర్చన, అలంకరణ దర్శనం చేయించి, ఆశీర్వచనం చేశారు. అనంతరం తీర్థ ప్రసాదం అందించి శేష వస్రంతో బైరెడ్డి రాజశేఖరరెడ్డిని సన్మానం చేశారు.