సంగారెడ్డి: సమస్యల పరిష్కారం కోరుతూ మంత్రి నివాసాన్ని ముట్టడించిన అంగన్వాడీ ఉద్యోగులు
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ ఉద్యోగులు సోమవారం సంగారెడ్డిలోని మంత్రి దామోదర రాజనర్సింహ నివాసాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తమ డిమాండ్లను వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు, సహాయ కార్య దర్శి యాదగిరి, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మంగ, తదితరులు పాల్గొన్నారు.